Wednesday, February 28, 2018

Jagathguru Sri Jayendra Saraswathi Swamiji


కంచి కామకోటి పీఠాధిపతి జగత్ గురు  పరమ  పూజ్య  శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర  సరస్వతి  స్వామిజి  వారి ఈ రోజు 28-2-2018 బుధవారం ఉదయం 9 గం.లకు కాంచీపురంలో  శివైక్యమ్ పొందారు. వారు భౌతిక  శరీరం  వదలి  వెళ్లడం  యావత్ హిందూ సమాజమునకు  తీరనిలోటు. స్వామివారికి  ఏలూరు అంటే  ప్రత్యేక  అభిమానం.వారి సమక్షంలో  ఎన్నోసార్లు  నేను మా బృందముతో  నాట్య ప్రదర్శన లు  ఇవ్వడమైనది. వారు ఎంతో ప్రేమతో నన్ను కంచి కామకోటి పీఠమునకు ఆస్థాన విద్వాన్ గ సత్కరింతు వారి మెడలోని స్పటికంలా తీసి నా మేడలో వేయించారు.అమెరికా నుండి వచ్చి న స్టూడెంట్స్ శిరీష ,అనురాధ స్వామి వారి ముందు నాట్యం చేసి వారి ఆశీస్సు లు పొందారు. పూజ్య స్వమాజీ వారు మా ఇంటికి వేంచేసి మా కుటుంభం సభ్యులను ఆశీర్వదించారు . నేను ఎప్పుడు స్వామి వారి దర్శనమునకు వెళ్లిన ఆదిపరాశక్తి రమ్మ అని పిలిచే వారు.  ఏలూరు లోని మన హిందూ యువ జన సంగమ్ లో  చాల సార్లు వారు దివ్య సందేశం అందించారు. వారికి హృదయపూర్వక అంజలి ఘటిస్తూ .. కళారత్న కే .వి సత్యనారాయణ. ఆస్థానవిద్వాన్ కంచి కామకోటి పీఠం 


Saturday, February 17, 2018