Tuesday, October 23, 2018

Saturday, October 13, 2018

Tuesday, October 2, 2018

గీతమ్ విద్యాసంస్థల అధినేత, రాజకీయ నాయకులు ముఖ్యంగా కళాప్రియులు ఆప్తులు శ్రీ యమ్.వి.వి.యస్.మూర్తి గారి ఆకస్మిక మరణము చాల విషాదకరమైనది.

గీతమ్ విద్యాసంస్థల అధినేత, రాజకీయ నాయకులు ముఖ్యంగా కళాప్రియులు ఆప్తులు శ్రీ యమ్.వి.వి.యస్.మూర్తి గారి ఆకస్మిక మరణము చాల విషాదకరమైనది. ఆమెరికా లో కారు ప్రమాదములో వారు మరణించడం జీర్ణించుకోలేక పోవుచున్నాము. 3 రోజుల క్రితం మూర్తి గారి పర్సనల్ సెక్రెటరీ తో  వారిని కలవాడనికి మాట్లాడను. అతను చెప్పాడు మూర్తి గారు 2 వారాలలో వస్తారు. ప్రస్తుతం అమెరికా లో వున్నారు అని చెప్పాడు. ఇంతలో ఈ  వార్త నమ్మసఖ్యముగా కాలేదు. 
                 నా నృత్యరూపకాలు అంటే వారికీ ఎంతో ఇష్టం అని చెప్పారు . పంచకావ్య , నృత్యాక్షరి, ఆముక్తమాల్యద అన్ని ఆయన చూసారు, ఎంతో అభినందించారు. గీతమ్ విశాఖపట్టణం లో నా కావ్య నాయకలు నృత్యరూపకం వారు ఏర్పాటుచేశారు. ఎన్నో కళాసంస్థలకు సహాయసహకారాలు అందించారు. నేను 1985 విశాఖపట్టణములోని నాట్యసుధ కళాసంస్థ తరపున కూచిపూడి శిక్షణ నిర్వహించేటప్పుడు కూడా వారు అక్కడి మా కార్యక్రమాలకు ఎన్నోసార్లు వచ్చి కళాకారులకు ఎంతో అభిమానంతో వారి తరపున బహుమతులో ఇచ్చేవారు.  
                      ఇంత గొప్ప కళాహృదయులు ఈవిధముగా దూరమవ్వడం దురదృష్టకరం . వారి ఆత్మకు శాంతి చేకూరలని , వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను 
             కే .వి. సత్యనారాయణ కూచిపూడి కళాకారులు ఏలూరు